05-03-2025 12:33:34 AM
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఇంటర్, ఫౌండేషన్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరిలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఐసీఏఐ మంగళవారం విడుదల చేసిం ది. సీఏ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షి అగర్వాల్ 86.63 శాతం మార్కులతో టాప్ ర్యాంక్‌లో నిలిచిం ది.
86 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన తోట సోమనాథ్ శేషాద్రి నాయుడు రెండో ర్యాంక్ సాధించారు. యూపీ హాథ్రస్‌కి చెందిన సర్థాక్ అగర్వాల్ 85.83 శాతం మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక సీఏ ఇంటర్ గ్రూప్ 1 పరీక్షలను 1,08,187 మంది పరీక్ష రాయగా, అందులో 15,332 (14.17 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
గ్రూప్ 2 పరీక్షల్లో 22.16 శాతం, రెండు గ్రూప్‌ల విభాగం లో 14.05 శాతం మంది పాసయ్యారు. ఇక ఫౌండేషన్ పరీక్షల్లో 21.52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.