25-03-2025 12:00:00 AM
‘పొలిమేర’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. ఆయన నుంచి వస్తున్న మరో సినిమా ‘280c’. ఏప్రిల్ 4న థియేటర్ల ద్వారా ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో నవీన్‌చంద్ర హీరోగా నటించగా, షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. “ఈ సినిమా మా టీమ్ అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ ఇచ్చింది.
ఇది ఓ వైద్య జంట ప్రేమకథ. హీరోయిన్ క్యారెక్టర్‌ను 28 డిగ్రీ సెంటిగ్రేడ్స్‌లోనే ఉంచాలి, లేకుంటే తనకు హెల్త్ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ పాయింట్ విన్నప్పుడు చాలా ఉత్సాహం అనిపించింది” అన్నారు. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా నేను చేసిన తొలి సినిమా ఇది. సినిమా చివరి 20 నిమిషాలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంత కొత్తగా ఉంటుంది’ అని తెలిపారు.