calender_icon.png 16 April, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బైరి శంకర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

16-04-2025 01:25:17 AM

సిద్దిపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు మంగళవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూలమాల, శాలువాలతో సత్కరించి, కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం, ప్రేమ, అభిమానంతో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.