ప్లాట్లు కోల్పోతున్న బాధితుల ఆందోళన
చేవెళ్ల, సెప్టెంబర్ 8: బీజాపూర్ రహదారి విస్తరణలో భాగంగా చేవెళ్లలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని లక్ష్మీనగర్ కాలనీ బాధితులు డిమాండ్ చేశారు. 2018లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని వారు వాపోయారు. ఆదివారం బాధితులు బైపాస్ రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా అధికారులు, కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ కు న్యాయం జరగడం లేదన్నారు. పైసా పైసా కూడాబెట్టి ప్ల్లాట్లు కొనుగోలు చేశామని, పరిహారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు.