12-02-2025 02:02:47 AM
సిద్దిపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీఫామ్‌తో గెలిచిన నలుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులతో అన్నారు.
మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన అనుచరులతో కేసీఆర్‌ను మార్కుక్ మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. రాజయ్య అధ్వర్యంలో ధర్మసాగర మాజీ జడ్పీటీసీ కిర్తి వేంకటేశ్వర్లు మరి కొంతమంది కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ పాలనే కోరుకుంటున్నారని పార్టీ కార్యకర్తలతో అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్యనే ఎమ్మెల్యేగా గెలుస్తాడని చెప్పారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఈ నెల 15న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు.నైపుణ్య శిక్షణలో సహకరిస్తాం