calender_icon.png 27 September, 2024 | 6:50 PM

చార్జీలు విధిస్తే యూపీఐకి బైబై

23-09-2024 12:00:00 AM

సర్వేలో మెజారిటీ యూజర్ల స్పందన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22:  యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తే ఆ సర్వీసును ఉపయోగించబోమని మెజారిటీ యూపీఐ యూజర్లు కుండబద్దలు కొట్టారు. లోకల్ సర్కిల్స్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో 75 శాతం మంది యూజర్లు చార్జీలకు వ్యతిరేకంగా స్పందించారు. సర్వేలో పాల్గొన్న యూజర్లలో 38 శాతంమంది వారి  50 శాతం చెల్లింపు లావాదేవీలకు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర డిజిటల్ లావాదేవీలకు బదులుగా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. కేవలం 22 శాతం మంది యూపీఐ యూజర్లు మాత్రమే యూపీఐ లావాదేవీ ఫీజును భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 308 జిల్లాల్లో 42,000 మంది యూజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేను జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో ఆన్‌లైన్ ద్వారా సర్వే నిర్వహించారు.