calender_icon.png 28 September, 2024 | 2:54 AM

ఎర్ర సముద్రానికి అండ.. తండ్రీకొడుకులే!

28-09-2024 12:57:24 AM

రివ్యూ

సినిమా: దేవర

విడుదల తేదీ: సెప్టెంబర్ 27, 2024

తారాగణం: ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్‌అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే తదితరులు 

దర్శకత్వం: కొరటాల శివ

నిర్మాత: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్

సంగీత దర్శకత్వం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. భారీ అంచనాల నడుమ శుక్రవారం థియేటర్లలో విడుదలైందీ చిత్రం. బతుకుదెరువు కోసం సముద్రంపై చేసిన తప్పుడు పనులే తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలుసుకుంటాడు కథానాయకుడు.

దొంగతనం మాని, చేపల వేటను ఉపాధిగా మలుచుకుందామన్న ఆయన ఆలోచనకు మిగతా వాళ్లు ఎందుకు కట్టుబడి ఉండలేదు? వారి దుర్బుద్ధి వల్ల కథ ఏ తీరం చేరిందనే అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా ఎలా ఉందో సమీక్షించుకుందాం.. 

కథ: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని రత్నగిరి వద్ద కొండపై నాలుగు ఊళ్లు ఉంటాయి. సముద్ర తీర ప్రాంతంలోని ఆ నాలుగు ఊళ్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్‌అలీఖాన్) తమ తమ ఊళ్లకు పెద్దగా ఉంటారు. మిగతా రెండు గ్రామాల వారితో కలిసి దేవర, భైర సముద్రం మీదుగా వచ్చే షిప్‌ల్లో దోపిడీ చేస్తుంటారు.

కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరకు, భైర బ్యాచ్‌తో గొడవ జరుగుతుంది. ఆ గొడవలకు కారణం ఏమిటి..? దేవర అజ్ఞాతంలోకి పోవడానికి కారణం ఏమిటి..? దేవర కొడుకు వర (ఎన్టీఆర్ రెండో పాత్ర) ఎందుకు భయపడుతూ ఉంటాడు? తంగం (జాన్వీకపూర్) ఎవరు? అనేదే సినిమా కథ. 

నటీనటుల గురించి.. 

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం అద్భుతం. రెండు పాత్రల్లోనూ తారక్ నటన మొత్తం సినిమాకే హైలైట్. జాన్వీకపూర్ పాత్ర నిడివి తక్కువే అయినా చాలా బాగా నటించింది. బాలీవు డ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా అదరగొట్టాడు. శృతి మరాఠే నటనతో మెప్పిం చిది. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, మిగతా నటీనటులు ఆకట్టుకున్నారు. 

మెప్పించే అంశాలివే.. 

కమర్షియల్ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. 90ల కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణ, వాటి నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. క్లైమాక్స్‌లో, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్సెస్ అహో అనిపించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం, పాటలు ఆకట్టుకున్నాయి. కొరటాల శివ రచయితగా, దర్శకుడిగా పూర్తి న్యాయం చేశారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. 

మైనస్ పాయింట్లు.. 

బరువైన భావోద్వేగాలతో, భారీ విజువల్స్‌తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ చాలావరకు ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. మెయిన్ థీమ్‌తో పాటు కీలక సన్నివేశాలు బాగున్నా, మిగతా కొన్ని సన్నివేశాలు నెమ్మదించాయి. ఫస్ట్ ఆఫ్ లాగినట్టుగా అనిపించి, కొద్దిగా బోర్ ఫీలింగ్ వస్తుంది. జాన్వీ, ఎన్టీఆర్ లవ్‌ట్రాక్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేది.