calender_icon.png 21 April, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో ఉపఎన్నికలు

21-04-2025 01:01:13 AM

  1. కాంగ్రెస్ గెలవడం బీఆర్‌ఎస్ కంటే ప్రజలకే ఎక్కువ నష్టం
  2. హామీలకు పైసలు లేవంటూ.. లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళనా?
  3. మత రాజకీయాలు తప్ప బీజేపీ చేసిందేమీ లేదు
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం

హైదరాబద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్ని కలు రాబోతున్నాయని, అందులో చేవె ళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలుంటాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఉప ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్‌రెడ్డి త్వరలోనే ఎమ్మెల్యే కాబోతున్నారంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నగరంలోని అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత శ్రీరామ్‌రెడ్డి తన అను చరులతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవడం, బీఆర్‌ఎస్ కంటే ప్రజలకే ఎక్కువ నష్టమన్నారు.

అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ నేతల మాట లు పెద్దవని, చేతలేమో చిన్నవని ఆరోపించారు. ఎన్నికలప్పుడు లోకల్ లీడర్ల ను ప్రజలు నమ్మనందునే కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి డిక్లరేషన్లు చేశారని విమ ర్శించారు. రాజేంద్రనగర్‌లో తనకు భూములున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అవి ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు దిక్కులేదుగానీ, లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తానని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రానికి బీజేపీ ఒక్క మంచిపని చేయలేదని, మత రాజకీయాలు తప్ప ఆ పార్టీ చేసిందేమీ లేదని ఆరోపించారు. రేవంత్‌పై ఆరోపణలు చేసే కమలం పార్టీ నేతలు అతడిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో సంబంధాలు ఉన్నందునే రేవంత్.. నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు ఉన్నా స్పందించడం లేదని ఆరోపించారు.

హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్న ప్రభుత్వం.. కాంగ్రెస్ నేతల ఇళ్లు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లల్లో ఉన్నా ఎందుకు ముట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు రాజేంద్రనగర్ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ పార్టీ ఇన్‌చార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.