calender_icon.png 4 March, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

29-01-2025 12:49:14 AM

లాభాల్లోకి దూసుకెళ్లిన సూచీలు

ముంబై: దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడయ్యాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులను  జొప్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన విషయం  తెలిసిందే. రూ.60వేలకోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను మూడు విడత ల్లో బహిరంగ మార్కెట్  క్యాపిటల్ ద్వారా కొనుగోలు చేయనున్నది. జనవరి 30న తొలి విడతలో రూ.20వేలకోట్లు  సెక్యూరిటీ కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

ఆ తర్వాత ఫిబ్రవరిలో మరో రెండు విడతల్లో కొనుగోలు  చేయనున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో మార్కెట్ బ్యాంకింగ్ స్టాక్స్ భారీ కొనుగోళ్లతో ప్రారంభమయ్యాయి.  ప్రారంభంలోనే సెనెక్స్ 323.76 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లకుపైగా లాభంతో మొదలైం ది. 

సెన్సెక్స్ గత సెషన్‌తో పోలిస్తే 75,659.00 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. చివరకు 535.23 పాయింట్లు పెరిగి.. 75,901.41 వద్ద ముగిసింది. నిఫ్టీ 128.1  పాయింట్లు పెరిగి.. 22,957.25 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,116 షేర్లు  లాభపడగా.. 2,429 షేర్లు పతనమ్యాయి.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం తగ్గగా..  స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం పడిపోయింది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన లాభాలను ఆర్జించాయి.