calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షంకు తడిసిన ధాన్యం కొనుగోలు

19-04-2025 08:51:56 PM

కామారెడ్డి (విజయక్రాంతి): అకాల వర్షం వలన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని కన్నాపురం గ్రామములో వరి కొనుగోలు కేంద్రం (PPC) వద్ద  రైతులు అరబోసిన వరి ధాన్యం తడిసిపోయిన వాటిని రైతులవద్ద కొనుగోలు చేసి సంచులలో నింపిన 1000 ధాన్యం బస్తాలు తడిచిపోయిన వాటిని కొనుగోలు చేసినట్లు అల్లూరు ఎల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ సదాశివరెడ్డి తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ACSO  శ్రీనివాసరావు, కన్నపూర్ ppc సెంటర్ కు వెళ్లి తడిసిన ధాన్యపు బస్థాలను సమీపంలో భాగ్యలక్ష్మి రైస్ మిల్ కు పంపినట్లు తెలిపారు, వర్షం వచ్చినపుడు వరి కుప్పలను టర్పాలిన్స్ తో కప్పుకోవలెనని రైతులకు సూచించారు.త్వరత్వరగా కాంట చేసి రైస్ మిల్లులకు పంపవలెనని సెంటర్ ఇంచార్జ్ ని అదేషించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి , మనిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు , సొసైటీ Ceo ప్రజాపతి, రైతులు పాల్గొన్నారు.