జిల్లా అదనపు కలెక్టర్ మాధురి
అందోల్,మే 17 : ధాన్యం కొనుగోల్లలో వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి తెలిపారు. శుక్రవారం అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలోని ఇషోజ్పేట్, గొంగ్లూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని సూచించారు.