calender_icon.png 21 November, 2024 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు చేసి రూ.500 బోనస్ ఇవ్వండి..

04-11-2024 04:49:34 PM

తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించిన శంకరపట్నం బిజేపి నేతలు..

మనకొండూర్ (విజయక్రాంతి): రైతుల పంట (వడ్లను) తక్షణం కొనుగోలు చేయాలని, మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి మనకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లాకు ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన కొనే దిక్కు లేకుండా పోయిందన్నారు.

పలు గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని దుస్థితి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను పోసుకొని రైతులు రోజుల తరబడి పంట కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలన్నీ వడ్ల కుప్పలతో నిండిపోయి, స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. వాతావరణ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు పంట కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో చేస్తున్న ప్రకటనకు ఆచరణకు పొంతన లేకుండా పోయిందన్నారు.

రైతుల పంట కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేయాలని, వడ్ల కొనుగోళ్లను తక్షణం ప్రారంభించాలని, అలాగే అన్ని రకాల సన్న వడ్లకు మద్దతు ధర చెల్లించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ. 500 బోనస్ వెంటనే ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో కోసం రైతులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు నీడ పట్టున ఉండడానికి చర్యలు తీసుకొని, త్రాగునీరు, టార్ఫాలీన్లు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొయ్యడ అశోక్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కనకం సాగర్, శక్తి కేంద్ర ఇన్చార్జులు రాసమల్ల శ్రీనివాస్, బొజ్జ సాయిప్రకాష్, చెర్ల శ్రీనివాస్, దాసరి సంపత్, వడ్లకొండ రాజేందర్, రెడ్డి శ్రీనివాస్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.