26-03-2025 09:13:09 PM
వైరా (విజయక్రాంతి): మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహిస్తున్న భీమ్ దీక్షలో భాగంగా పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ఖమ్మం జిల్లా స్వేరోస్ కమిటీ ఉపాధ్యక్షులు తగరం శ్రీకాంత్, ఇండ్ల మహేష్ స్వేరోస్ కోటేశ్వరావులు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం వైరాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద పరీక్ష రాసిన అనంతరం విద్యార్థులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఎండ తీవ్రతగా ఉండటంతో మజ్జిగ సేవించిన విద్యార్థులు ఉపశమనం పొందటం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.