19-04-2025 09:38:07 PM
మందమర్రి (విజయక్రాంతి): షాలోమ్ పాస్టర్ ఫెలోషిప్ ఆసోసియేషన్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం రన్ ఫర్ జీసస్ పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ చేసినట్లు అధ్యక్షులు ఏలీయా, జనరల్ సెక్రెటరీ ఆనంద్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జూపాక సాల్మోన్, పాస్టర్లు ముల్కల జాన్ ప్రసాద్, జెర్మీయా, జెబాస్, విలియం, ఉపేందర్, సాల్మోన్, యేసుపాదం, సునీల్, కిషోర్, లూథర్ లు పాల్గొన్నారు.