calender_icon.png 2 April, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

01-04-2025 05:10:47 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి గుండా బాలకృష్ణ తన సోదరుడు గుండా సంతోష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతని జ్ఞాపకార్థం మంగళవారం మధ్యాహ్నం తాండూర్ ఐబీ సెంటర్ లో అండర్ బ్రిడ్జి క్రింద బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేసినందుకు ఐబీ సెంటర్లోని ప్రయాణికులు, వాహనదారులు బిజెపి, బిజెవైఎం నాయకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు గుండా సాయితేజ, గుండా నరేష్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నౌనూరి సుధీర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, బిజెపి తాండూర్ మండల్ ప్రధాన కార్యదర్శి కొమండ్ల శ్రీనివాస్, బీజేవైఏం మండల అధ్యక్షులు మామిడి విఘ్నేష్, ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్, బొమ్మేలి శ్రావణ్, సీనియర్ నాయకులు యంగర్ తుకారాం, నాయకులు దుర్కి బీరేష్, ఏముర్ల ప్రవీణ్, లక్ష్మణ్, సాత్విక్, అనుదీప్, సాయికుమార్, రామ్ చరణ్, సిద్ధార్థ్, మనోజ్, చంటి, తదితరులు పాల్గొన్నారు.