calender_icon.png 19 April, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెతెస్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

18-04-2025 06:47:25 PM

మందమర్రి,(విజయక్రాంతి): బెతెస్త వాలంటరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో గుడ్ ఫ్రైడేను  పురస్కరించుకొని శుక్రవారం సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంస్థ  అధ్యక్షులు కె.ఆనంద్ మాట్లాడారు. ఏసుక్రీస్తు సర్వ మానవాళి శ్రేయస్సు కోసం శిలువ మరణం పొందిన రోజును శుభ శుక్రవారం గా పాటిస్తారని అన్నారు. దీనిలో భాగంగానే పట్టణ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు స్టీఫెన్, డబ్ల్యు సురేందర్, సిహెచ్ మల్లేష్, జాన్ లు పాల్గొన్నారు.