calender_icon.png 7 April, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు సిపిఎం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

06-04-2025 05:34:41 PM

ప్రారంభించిన ఇల్లందు ఎస్ఐ నాగుల్ మీరా..

ఇల్లెందు (విజయక్రాంతి): శ్రీరామ నవమిని పురస్కరించుకొని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ రామాలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణి కార్యక్రమంను ఇల్లందు ఎస్ఐ నాగుల్ మీరా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శ్రీరామ నవమి సందర్బంగా భక్తులకు ఎండలు దంచి కొడుతున్న తరుణంలో ఈ కార్యక్రమంను నిర్వహించడం అభిందనీయం అని అన్నారు.

ప్రతి ఒక్కరు సేవా దృక్పధం కలిగి ఉండాలని, మానవత దృక్పధంతో అందరు కలిసి మెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత సహాయాన్ని అందించడంలో ముందుండాలని మత సమరస్యాన్ని పెంపోందిస్తూ పండగలను కలిసి జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, మాజీ ఎంపీటీసీ మండల రాము, మాజీ సర్పంచ్ పాయం లలిత, తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జ సురేష్, కొడెం బోస్, అబ్బాస్, జైబున్నిసా, భార్గవ్ బాయమ్మ, వర్షిత్, శ్రీను, సృజన్, తదితరులు పాల్గొన్నారు.