calender_icon.png 8 April, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మజ్జిగ తాగి ఆశీర్వదించండి..

06-04-2025 06:18:59 PM

ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దు రెడ్డి కందకట్ల..

శంషాబాద్ లో మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభం..  

ప్రతిరోజు 10 వేల మందికి వితరణ.. 

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం తన బాధ్యత అని ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దు రెడ్డి కందకట్ల పేర్కొన్నారు. ప్రజలు తాను వితరణ చేసే మజ్జిగ తాగి తనను ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాదిలాగే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం శంషాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దు రెడ్డి మాట్లాడుతూ.. వేసవికాలంలో కొందరు నీళ్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉంటారని వారికోసం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

శంషాబాద్ లో కూలీలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వేలాదిమంది బస్టాండ్ సమీపంలో ఉంటారని వారందరి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేశానని వివరించారు. మన ఇళ్లల్లో తయారు చేసుకునే విధంగా పరిశుద్ధంగా మజ్జిగను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల దాహార్తి తీర్చడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వేసవి పూర్తయ్యే వరకు కూడా మజ్జిగ పంపిణీ కేంద్రం కొనసాగుతుందన్నారు. రోజు సుమారు పదివేల మంది వరకు మజ్జిగ పంపిణీ చేస్తామని సిద్దు రెడ్డి కందకట్ల పేర్కొన్నారు. వేసవి పూర్తయ్య వరకు మజ్జిగ కేంద్రం కొనసాగుతుందన్నారు. సమాజం నుంచి మనం ఏం తీసుకుంటున్నామని కాకుండా సమాజానికి మనం ఏమిస్తున్నామన్నది ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దు రెడ్డి సన్నిహితులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.