calender_icon.png 3 April, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బట్లర్ విధ్వంసం.. గుజరాత్ విజయం

03-04-2025 01:24:53 AM

  • 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి
  • మెరిసిన సిరాజ్, సాయి సుదర్శన్
  • నేడు సన్‌రైజర్స్‌తో కోల్‌కతా ‘ఢీ’

బెంగళూరు, ఏప్రిల్ 2: ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని అందుకుంది. బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందింది. బట్లర్ ఊచకోతకు తోడు హైదరాబాదీ సిరాజ్ బౌలింగ్‌లో మెరవడంతో గుజరాత్ విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

టాపార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్ (54), జితేశ్ శర్మ (33), టిమ్ డేవిడ్ (32) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

జాస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. సాయి సుదర్శన్ (49), రూథర్‌ఫోర్డ్ (30 నాటౌట్) ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్, హాజిల్‌వుడ్ చెరొక వికెట్ తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.