బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్ సూపర్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో అమెరికాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ (30), కోరె అండర్సన్ (29) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ నాలుగు వికెట్లు ఒకే ఓవర్లో పడగొట్టడం మరో విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో జట్టు రన్‌రేట్ అమాంతం పెంచాడు.