calender_icon.png 12 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏలేటి మహేశ్వర్‌రెడ్డిది అవగాహనారాహిత్యం

02-11-2024 12:00:00 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్‌రెడ్డిని తప్పిస్తుందంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అవగాహన లేకుండామాట్లాడుతున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. రేవంత్ పూర్తికాలం సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.

ఏలేటికి రాజకీయ అవగాహన లేదని, తమ వద్దకు వస్తే శిక్షణ ఇస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. మహేశ్వర్‌రెడ్డిని బీజేపీలో ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే నిత్యం మీడియాలో ఉండేందుకే ఏదో ఒకటి మాట్లాడుతున్నారన్నారు.