ఈ మధ్య కాలంలో బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తరుచూ తెలంగాణ భవన్‌లోని క్యాంటీన్‌లో సందడి చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నారు. టీ, కాఫీలు తాగుతూ కబుర్లు సైతం చెప్తున్నారు. ఈ వీడి యోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతవవరకు బాగానే ఉంది. అయితే, ఆ క్యాంటీన్ బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత కేసీఆర్ ప్రారంభించారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కనీసం ఒక్కసారి కూడా క్యాంటీన్‌లో అడుగు పెట్టని ఈ ఇద్దరు నేతలు.. ఒక్క నవంబర్ నెలలోనే మూడు సార్లు క్యాంటీన్‌లో కార్యకర్తలతో భోజనం చేయడంపై సోషల్ మీడియాలో ఛలోక్తులు పేలుతున్నాయి. ఓడిపోతే కానీ కార్యకర్తలు గుర్తుకురాలేదని, క్షవరం అయ్యాక వారికి వివరం తెలిసిందా? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.