06-02-2025 11:33:11 PM
మలక్‌పేట: షబ్బే పర్వదినం పురస్కరించుకుని పాతనగరంలోని స్మశానవాటికలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. షబ్బే సందర్భంగా ముస్లిం సోదరులు స్మశానవాటికలో పెద్దలను స్మరించుకుని ప్రార్ధన నిర్వహిస్తుంటారు. ఆజంపురా డివిజన్‌లోని సూఫీ మసీదు స్మశానవాటిక, మహరూఫ్ అలీ షా స్మశాన వాటిక, బోధి అలీ షా స్మశాన వాటిక తదితర వాటిలో పిచ్చి మొక్కలు, వ్యర్థాల తొలగింపు, జంగిల్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులను జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు డివిజన్ ఎంఐఎం నాయకుడు షేక్ మొహియుద్దీన్ అబ్రార్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ మల్లికార్జున్, ఎంఐఎం పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.