calender_icon.png 24 October, 2024 | 2:02 AM

జోరుగా తుక్కు వ్యాపారం

15-07-2024 12:48:35 AM

సంగారెడ్డి జిల్లాలో రూ.కోట్లలో దందా

జీఎస్టీ చెల్లించని వ్యాపారులు

సంగారెడ్డి, జూలై 1౪ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో తుక్కు వ్యాపారం రూ. కోట్లలో సాగుతున్నా వ్యాపారులు మాత్రం జీఎస్టీ చెల్లించడం లేదు. సంబంధిత అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. గ్రామా లు, పట్టణాల్లోని గల్లీల్లో తిరిగే  చిరువ్యాపారులు పాత ఇనుము, ప్లాస్టిక్, పేపర్లను కొనుగోలు చేసి స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తారు. స్క్రాప్ దుకాణం నిర్వహించే వ్యాపా రులు ఒకేసారి లోడ్ చేసి, హైదరాబాద్‌లోని పరిశ్రమలకు లారీలు, డీసీఎం వాహనాల్లో తరలించి, అమ్ముతారు.

ఇలా సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, నారాయణఖేడ్, జహీరా బాద్ పట్టణాల్లో నెలకు రూ.కోట్లలోనే తుక్కు వ్యాపారం నడుస్తున్నది. ఇదంతా జీరో వ్యా పారంగానే సాగుతున్నది. పాత సామానులు కోనుగోలు చేసే వ్యాపారులు ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. సంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న జీఎస్టీ అధికారులకు తుక్కు వ్యాపారులు ప్రతీ నెల ముడుపులు చెల్లిస్తున్నారని తెలిసింది.