calender_icon.png 3 April, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిన బిజీబిజీ..

02-04-2025 12:00:00 AM

‘బేబి’ సినిమాతో వెండితెరకు తొలి పరిచయం అవ్వడంతోనే అందరినీ కట్టిపడేసిన అచ్చ తెలుగందం వైష్ణవి చైతన్య. ఇలా మొదటి సినిమాతోనే నేమ్, ఫేమ్ కలిసి రావడంతో ఈ భామ.. గాలి ఉన్నప్పుడే వడ్లు తూర్పారబట్టాలన్న నానుడిని పక్కాగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోయన్ల కొరతను ఈ ‘బేబి’ క్యాష్ చేసుకుంటోందట. డిమాండ్‌కు తగ్గట్టు ఈ అమ్మడు రెమ్యూనరేషన్ పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఒక్కో సినిమాకు రూ.కోటికిపైగానే పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది. ఇక వైష్ణవి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు, త్వరలో ప్రారంభం కానున్నవి, చర్చల్లో ఉన్నవన్నీ కలిపి చూసుకుంటే.. దక్షిణాదిన త్వరలో ఈమె హవా కొనసాగనుందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సిద్దు జొన్నలగడ్డతో ‘జాక్’ సినిమా చేస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా ఆదిత్య హాసన్ కాంబోలో మరో సినిమా చేస్తోంది.

ఇంకా రెండు ప్రాజెక్టుల్లోనూ భాగమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకటి నాయికా ప్రాధాన్యమున్న సినిమా అని టాక్. విభిన్నమైన థ్రిల్లర్ కథతో తనను సంప్రదించిన ఓ కొత్త దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.

రెండు తమిళ ప్రాజెక్టుల్లో ఈ భామ భాగమవుతున్నట్టు తెలుస్తోంది. విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించను న్న ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో వైష్ణవినే హీరోయిన్ అంటున్నారు. ఈ ప్రచారం నిజమైతే, ఈ ప్రాజెక్టే ఈ హైదరాబాదీ అందానికి తొలి తమిళ చిత్రం అవుతుంది.

మరో కన్నడ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా పట్టాలెక్కితే సౌత్ సినిమాలో ఎక్కువగా వినిపించే పేరు వైష్ణవి చైతన్యదే అన్న టాక్ వినవస్తోంది.