calender_icon.png 21 January, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాక్టీస్ సెషన్‌లో బిజీబిజీగా

21-01-2025 12:36:11 AM

భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ రేపు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20

కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు కోల్‌కతాకు చేరుకోగా.. సోమవారం ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టీమిండియా ఆటగాళ్లు సాధన చేయగా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలయ్యారు.

జట్టులోకి తిరిగొచ్చిన పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌పై కూడా దృష్టి సారించగా.. తిలక్ వర్మ, పాండ్యా, సూర్యకుమార్ ప్రాక్టీస్ అనంతరం గంభీర్‌తో చర్చించారు. వరుణ్, రవి బిష్ణోయిలు సలహాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

రింకూ సింగ్ సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అటు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫుట్‌బాల్  ఆడుతూ ప్రాక్టీస్ కొనసా గించారు. సోమవారం 31వ పడిలోకి అడుగుపెట్టిన స్పిన్నర్ అక్షర్ పటేల్ మీడియాతో మాట్లాడాడు. ‘గత పదేళ్లలో జడేజా బౌలింగ్‌ను దగ్గరి నుంచి గమనిస్తూ అతడి నుంచి సలహాలు తీసుకున్నా. ప్రస్తుతం టెస్టుల్లో భారత్ సంధి దశలో ఉంది. నేను కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. మూడు ఫార్మాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని తెలిపాడు.