- బీదర్ కేంద్రంగా అక్రమ రవాణా
- హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు సరఫరా!
- పోలీసుల దాడులతో వెలుగులోకి దందా
సంగారెడ్డి, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో గుట్కా అమ్మకాలు నిషేధించడం తో పక్క రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తూ కిరాణషాపులు, పాన్‌షాపుల్లో విక్రయిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్ కేంద్రంగా గుట్కా, పాన్ మాసా ల దందా సాగుతున్నది. వ్యాపారులు బీదర్‌లో కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. బీదర్‌కు చెందిన గుట్కా వ్యాపారులు కర్ణాటకకు సమీపంలో ఉన్న జహీరాబాద్ ప్రాంత సరిహద్దులో ఉన్న ఫాం హౌస్‌ల్లో షెడ్లను ఏర్పాటు చేసి, జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, హైదరాబాద్‌లో ఏజెంట్లను నియమించుకుని అక్రమంగా సరఫరా చేస్తున్నారని తెలి సింది. రాష్ట్రంలో గుట్కా అమ్మకాలపై నిషేధం ఉండడంతో అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. కొందరు సంగారెడ్డి జిల్లాలోని మూతపడిన పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రం లో అక్రమంగా గుట్కా తయారు చేస్తున్నార నే తెలిసింది. పారిశ్రామిక ప్రాంతాల్లో గుట్కా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారని సమాచారం.
భారీగా స్వాధీనం..
సంగారెడ్డి జిల్లాలో పోలీసులు వారం రోజుల్లో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 65వ జాతీయ రహదారిపై కంకోల్ టోల్ గేట్ వద్ద రూ.3,494.40 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుంచి అక్రమంగా డీసీఎంలో హైదరాబాద్‌కు గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ చెన్నూర్ రూపేష్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేసి, సోమవారం తెల్లవారుజామున గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. ఈ నెల 12న సంగారెడ్డి పట్టణంలో రూ.2 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 13న ఐడీ ఏ బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో రూ.2 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రతి రోజు వాహనాలు తనిఖీ చేస్తుండడంతో గుట్కా దందా బయటపడుతున్నది.
మీడియా ముసుగులో గుట్కా తరలింపు?
రాష్ట్రంలో నిషేధం ఉండటంతో స్మగ్లర్లులు కొత్త కోణంలో వ్యాపారం చేస్తున్నారు. మీడియా ముసుగులో బీదర్ నుంచి గుట్కాను అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు బీదర్ నుంచి మినీ గూడ్స్ వాహనాలు, డీసీఎంలలో గుట్కా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. స్మగ్లర్లకు ఏజెంట్లుగా పని చేస్తున్న వారు జహీరాబాద్ నుంచి కంకోల్ టోల్ గేట్ వరకు కారు, బైక్‌లపై తిరుగుతూ ముందస్తు సమాచా రం ఇస్తున్నారని తెలిసింది. బైక్‌పై ప్రెస్ అని స్టిక్కర్లు వేయించుకుని, 65వ జాతీయ రహదారిపై ఎక్కడ పోలీసులు ఉన్నారో సమాచారం ఇస్తున్నా రని తెలిసింది.
గుట్కా రవాణాపై ప్రత్యేక నిఘా
గుట్కా అమ్మకాలు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో గుట్కా అక్రమ రవాణాను నివారించేందుకు 65వ జాతీయ రహదారితో పాటు పలు మార్గాల్లో పోలీసు లు ప్రత్యేక నిఘా పెట్టారు. గుట్కా తరలింపును అడ్డుకుని, నిందితులను అరె స్టు చేస్తున్నాం. టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.
చెన్నూర్ రూపేష్, ఎస్పీ, సంగారెడ్డి