calender_icon.png 23 December, 2024 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందడి @ బుక్‌ఫెయిర్

23-12-2024 03:01:47 AM

ఎన్టీఆర్ స్టేడియానికి పోటెత్తిన పుస్తక ప్రియులు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన బుక్‌ఫెయిర్‌కు విద్యార్థులు, యువత, పుస్తకప్రియులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. బుక్ ఫెయిర్‌లో మొత్తం 350 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. భారత రాజ్యాంగం పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్ నంబర్ 204 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ స్టాల్‌లో మొత్తం 5 రకాల రాజ్యాంగాలను ప్రదర్శన, అమ్మకానికిఉంచారు. అలాగే వివిధ లా కళాశాలలు, పలు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రత్యేకంగా ప్రచురించిన రాజ్యాంగం పుస్తకాలు బుక్‌ఫెయిర్‌లో అందుబాటులో ఉన్నాయి. బుక్ ఫెయిర్‌లో వివిధ అకడమిక్ పుస్తకాలతో సామాజిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య అంశాలకు చెందిన పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, తెలగు, హిందీ, ఆంగ్ల భాషలతో పాటు అన్ని రాష్ట్రాల భాషల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.