calender_icon.png 11 January, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో వ్యాపారిపై కాల్పులు

08-12-2024 12:02:24 AM

* మార్నింగ్ వాక్ చేసి వస్తుండగా దాడి

* అక్కడికక్కడే మృతిచెందిన బాధితుడు

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వ్యాపారిపై ఢిల్లీలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చో టుచేసుకుంది. కృష్ణానగర్‌కు చెందిన సునీల్ జైన్(57) వ్యాపారవేత్త. రోజూలాగే వాకింగ్ వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండ గులు మీ ఫోన్ కింద పడిందని జైన్‌కి చెప్పి కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షాహదారా ఘటనపై విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.