కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ తన స్నేహితులతో కలసి మహారాష్ట్రలోని పండరిపూర్ దర్శనానికి వెళ్లి వస్తుండగా గురువారం అర్ధరాత్రి ఉట్నూరు-జైనూర్ మధ్య కల్వట్టుకు కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. అతని స్నేహితులకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్, మహారాష్ట్ర మెరుగైన వైద్య కోసం తరలించారు. దైవదర్శనికి వెళ్లి వస్తుండగా శ్రీనివాస్ అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగారు. వ్యాపారి మృతి పట్ల జిల్లా కేంద్రంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థల బంద్ నిర్వహించి సంతాపం ప్రకటించారు.