calender_icon.png 24 October, 2024 | 12:07 AM

వ్యాపార నిర్వహణ వారికి ఇబ్బందే

15-07-2024 02:21:49 AM

హెల్త్ కమిటీ చైర్మన్ శేఖర్ అగర్వాల్

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఆరోగ్యవంతులే పరిశ్రమలను హెల్దీగా నడపగలుగుతారని, ఫిట్‌గా లేనివారికి వ్యాపార నిర్వహణ ఇబ్బందిగా మారుతుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్రీ (ఎఫ్‌టీసీసీఐ) హెల్త్ కమిటీ చైర్మన్ శేఖర్ అగర్వాల్  పేర్కొన్నారు. ఆదివారం ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లేక్‌లోని రోటరీ పార్కు నుంచి సచివాలయం వరకు వాక్‌థాన్‌లో శేఖర్ అగర్వాల్  మాట్లాడుతూ.. వ్యాపారం బాగా నడపాలనుకుంటే.. ముందు బాగా నడవాలని సూచించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోఖలే మాట్లాడుతూ.. చెమట పట్టకుండా ఏమీ సాధించలేమమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, ఎల్ వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, ఎంఎన్‌జీ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ద్వారకానాథ్, డాక్టర్ శ్రీకాంత్ బాబు, డాక్టర్ బుఖారి, డాక్టర్ నరేష్, డాక్టర్ వీణ, సురేష్ సింఘాల్  తదితరులు పాల్గొన్నారు.