calender_icon.png 16 January, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశీయ మార్గాల్లోనూ బిజినెస్ క్లాస్

06-08-2024 03:28:48 AM

‘ఇండిగో’ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకొంది. 12 ఎం పిక చేసిన దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. నవంబరునుంచి ఇవి అందుబాటలోకి వస్తాయని తెలిపింది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భం గా ఈ విషయాలు వెల్లడించింది, కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్ క్లాస్ టికెట్లు మంగళవారంనుంచే బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్ తెలిపారు.

ఈ సందర్భంగా ‘ఇండిగో బూల్చి ప్’ పేరిట కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవసరం మరో 7 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను ప్రారంభిం చనున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ రోజూ 2 వేల విమాన సర్వీసులను 120 గమ్యస్థానాలకు నడుపుతోంది.