20-03-2025 12:00:00 AM
వారాసిగూడ, మార్చి 19 (విజయక్రాంతి) : వారాసిగుడలో ఆర్టీసీ బసుల జాప్యంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. సికింద్రాబాద్ నుంచి జామై ఉస్మానియా వరకూ వెళ్ళే 86 నెంబర్ మరియు 107 బస్సులు తగినన్ని రాక ప్రయాణికులు గంటల సమయం నిరీక్షిస్తున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నా యి. మరో పక్క కనీసం నిల్చునేందుకు బస్టాప్ కూడా లేక ఇక్కడ ప్రయాణికులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు.
అటు వారాసిగూడ ప్రధాన రహారిపై కూడా బస్టాప్ లేదు. వస్తే ఒక దాని వెంట మరొకటి వరుసగా వస్తాయి. లేదంటే గంటకు పైగా ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూడాలి. సమయానికి రాని బస్సుల కోసం. మండు ఎండలో ఎదురు చూస్తూ అవస్తలకు గురి అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు విద్యార్థులు అధికంగా ఈ బస్సులను ఎక్కువ వినియోగించుకుంటున్నారు.
కావు నా ఇకనైనా ఈ రూట్‌లో తగినన్ని బస్సులు నడపాలని. అలాగే వెంటనే బషెల్టర్ నిర్మించాలని వారాసిగూడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా రు. తక్షణం చర్యలు తీసుకోవాలి. వెంకట రమణి. బీజేపీ మాజీ కార్పొరేటర్ గత కొంత కాలంగా ప్రయాణికులు మహిళలు విద్యార్థులు బస్సులు ఆలస్యం సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.