బీసీ కమిషన్‌తో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భేటీ
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, సభ్యుడిగా బీసీ గురుకులాల సెక్రటరీ బడుగు సైదులు బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ డీఎస్‌ఎస్ భవన్‌లో ఉన్న కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపల నివేదిక తయారు చేయడానికి ఈ కమిషన్ పనిచేస్తుందని బూసాని వెంకటేశ్వర రావు తెలిపారు.
అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మితో బూ సాని వెంకటేశ్వరరావు బీసీ కమిషన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటివరకు బీసీ కమిషన్ చేసిన అధ్యయన వివరాలను బూసాని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులు బీ సైదులు, శ్రీనివాస్ రావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.