calender_icon.png 27 October, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బస్టాండ్ బహు దూరం

30-08-2024 12:41:35 AM

నడిబొడ్డు నుంచి ఊరవతలకు

5 కోట్లతో గజ్వేల్ బస్టాండ్ నిర్మాణం

బస్టాండ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

గజ్వేల్, ఆగస్టు29: జనావాసాలు ఉన్న ప్రాంతాలకు దూరం గా నిర్మించడంతో గజ్వేల్ బస్టాండ్ నిరుపయోగంగా మిగిలింది. మాజీ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని రూ.5కోట్లతో బస్టాండ్‌కు ప్రణాళికలు చేయించారు. అయితే స్థాని క నాయకుల అత్యుత్సాహంతో గజ్వేల్ పట్టణానికి దూరం గా బస్టాండ్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో పెరిగే పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్‌ను గజ్వేల్ రింగురోడ్డుకు సమీపంలో నిర్మించా మని ప్రచారం చేసినా ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ప్రజలు నివసించడం లేదు.

గతంలో గజ్వేల్ నడిబొడ్డున ఉన్న బస్టాండ్‌ను సమీకృత మార్కెట్ నిర్మాణం పేరుతో కూల్చివేయడంతో మరో కొత్త బస్టాండ్ కూడా మం జూరు చేశారు. కానీ ఆ బస్టాండ్ గత మూడేండ్లుగా నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తు తం గజ్వేల్‌లో ప్రజలు బస్సుల కోసం రోడ్డుపై నిలబడి నానాయాతన పడుతున్నారు. బస్సులు రోడ్డుపైనే నిలుస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

జనవాసాలకు దూరంగా నిర్మించిన బస్టాండ్‌తో రూ.5 కోట్ల ప్రజాధనం వృథా అయిం దని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా గత ప్రభుత్వ పాలనాధి కారం ముగుస్తున్న తొందరలో పట్టణానికి దూరంగా నిర్మించిన బస్టాండ్‌కు సరైన రోడ్డు కూడా లేకుండానే హడావిడిగా ప్రారంభించి పాలకులు చేతులు దులుపుకున్నారు. ఈ సంగతి మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌కు తెలిసే జరిగిందా అన్నది ప్రజల్లో చర్చ జరుగుతుంది. 

బస్టాండ్‌ను మేం వినియోగించలేం

జనవాసాలకు దూరంగా ఉన్న గజ్వేల్ బస్టాండ్‌ను మేము వినియోగించలేము.ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో బస్టాండ్ నిర్మిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రజలకు అనుకూ లంగా, ఆర్టీసీకి లాభదాయకంగా ఉంటుంది. కానీ పట్టణానికి దూరంగా నిర్మించిన గజ్వేల్ బస్టాండ్‌ను మేము ఏ విధంగాను వాడుకోలేం. అక్కడి వరకు బస్సులను నడిపేతే ఆర్టీసీ నిధులను వృథా చేయడమే అవుతుంది.

- పవన్, డిపో మేనేజర్,

గజ్వేల్ ప్రజ్ఞాపూర్