calender_icon.png 5 December, 2024 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు సర్వీసులు పెంచాలి

04-12-2024 10:39:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో టీజీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందని బస్సులను కూడా పెంచాలని పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ అన్నారు. బుధవారం నిర్మల్ డిపో కార్లే ముందు బస్సులు పెంచాలని కోరుతూ మహిళలతో ధర్నా నిర్వహించి డిఎం ప్రతిమా రెడ్డికి వినతి పత్రం అందజేస్తారు. ఉదయం సాయంత్రం వేళలో బస్సులు సరిపోకపోవడంతో వృద్ధులు మహిళలు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది గురవుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న, కవిత, దుర్గా, గంగామణి, వనిత, విజయ, తదితరులు పాల్గొన్నారు.