calender_icon.png 11 February, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

11-02-2025 11:55:51 AM

జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా(Jabalpur District)లో మంగళవారం ఉదయం మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ నుండి తిరిగి వస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించారని అధికారి తెలిపారు. జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోరా పట్టణానికి సమీపంలో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా(Jabalpur Collector Deepak Kumar Saxena) మీడియాకి తెలిపారు.

ట్రక్కు, మినీ బస్సు ఢీకొన్న ఘటనలో హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఏడుగురు మృతి చెందారని తెలిపారు. ట్రక్కు రాంగ్ సైడ్ నుంచి హైవేపై వెళుతుండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు మినీ బస్సులో చిక్కుకున్నట్లు వారు తెలిపారు. ప్రమాదం అనంతరం కలెక్టర్‌, జబల్‌పూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రమాద స్థలానికి చేరుకున్నారు.