calender_icon.png 30 November, 2024 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు బోల్తా.. 10 మంది మృతి

30-11-2024 03:28:41 AM

  1. మహారాష్ట్రలోని గోండియాలో ఘటన
  2. ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం
  3. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

గోండియా, నవంబర్ 29:  మహారాష్ట్రలో జరిగిన ఘోర ర్డోడు ప్రమాదంలో 10 మంది చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన గోండియా జిలా ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం తూర్పు మహారాష్ట్రలోని భండారా నుంచి గోండియా జిల్లాకు 36 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతోంది. ఈ క్రమంలో సడక్ అర్జుని తాలూకాలోని దవ్వా గ్రామం వద్దకు చేరుకోగానే  ముందు వెళుతున్న ఓ వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు.

దీంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై అపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతు ల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషి యో ప్రక టించారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.