calender_icon.png 19 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

14-04-2025 12:00:00 AM

ఇద్దరి పరిస్థితి విషమం.. 

8 మందికి స్వల్ప గాయాలు 

కొండపాక, ఏప్రిల్ 1౩ :  ఆగి ఉన్న వాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు సంఘటన దుద్దెడ టోల్గేట్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరీంనగర్ పద్మా నగర్ కు చెందిన బంధువుల పెళ్లికి హైదరాబాద్ వెళ్లి, తిరిగి వస్తుండగా ఆదివారం ఉదయం దుద్దెడ టోల్గేట్ వద్ద ఆగి ఉన్న వాహనం ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు 8 మందికి స్వల్ప గాయాలయి, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

సమాచారం తెలుసుకున్న కొండపాక 108 సిబ్బం ది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన గా సంఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నదని, అదే సమయంలో హైదరాబాద్ నుంచి చిన్నకోడూరు వెళుతున్న మరొక 108 వాహనాన్ని నిలిపి కొంతమంది బాధితులను అందులో తరలించి, మిగతా వారిని కొండపాక 108 వాహనంలో ప్రథమ చికిత్స అందిస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు రుద్ర లతా  (36), జోట్టు లక్ష్మీనారాయణ(55), జొట్టు ఒడెమ్మ(58), శ్రీలత(38), రుద్ర రాజకుమార్ (40), అన్విత్ (15), రాజవ్వ(58), మాధవి(40), జై దేవ్ (46), సహస్ర(16) ఉన్నారు.