11-02-2025 12:45:41 AM
51 మంది మృతి
గ్వాటెమాలా సిటీ, ఫిబ్రవరి 10: 75 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో దాదాపు 51 మంది మృతవాతపడ్డారని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ‘ఇప్పటి వరకు 31 మృతదేహాలను బస్ నుంచి స్వాధీనం చేసుకున్నాం.
ఇందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని గ్వాటెమాలా సిటీ ఫైర్ సర్వీసెస్ అధికార ప్రతినిధి తెలిపారు. క్షతగాతులకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గ్వాటెమాలా అధ్యక్షుడు మూడు రోజుల పాటు జాతీయ సంతాపదినాలుగా ప్రకటించారు.