calender_icon.png 28 October, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం

28-10-2024 11:35:52 AM

బోడు గ్రామానికి ప్రారంభమైన ఆర్టీసీ బస్సు..

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలోని మారుమూల గ్రామాలకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. మండలంలోని బోడు గ్రామం మీదుగా ఇల్లందు మండలం రామకిష్టాపురం వరకు బస్సు సౌకర్యాన్ని కొత్తగూడెం డిపో మేనేజర్ మలగం దేవేందర్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఉదయం కొత్తగూడెంలో 7.15 గంటలకు బయలుదేరి, బోడు మీదుగా రామకిష్టాపురంకు ఉదయం 8 .30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి నేరుగా కొత్తగూడెం చేరుకుంటుందని మేనేజర్ తెలిపారు. సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరి 5.25 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

ప్రయాణికుల రద్దీ పరిస్థితిని బట్టి మరిన్ని ట్రిప్పులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని మేనేజర్ తెలిపారు. గతంలో బోడు గ్రామానికి బస్సులు తిరిగేవని, తమ టార్గెట్ రాక పోవడంతో నిలిపివేశామన్నారు. ఆర్టీసీని ఆదరిస్తే ప్రయాణీకులకు సౌకర్యంగా బస్సులు నడిపిస్తామన్నారు. బోడు ప్రాంతానికి ఆర్టీసీ బస్సు ప్రారంభించడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సిబ్బంది పోరండ్ల రామనరసయ్య, బోడు గ్రామస్తులు సతీష్, శ్రీను, సురేష్, నరసింహారావు, సాంబయ్య, సుధీర్, శేఖర్, శివ, నారాయణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, సంపత్, కొండారెడ్డి, రామచంద్రం, శ్రీను, వెంకటరాములు, ఎట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.