calender_icon.png 9 January, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ నుండి చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు 10 నిమిషాలకు బస్సు

08-01-2025 07:37:12 PM

మేడిపల్లి (విజయక్రాంతి): సికింద్రాబాద్ నుండి చర్లపల్లి రైల్వే టెర్మినల్ వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే.కవిత తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. నూతనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం అయినందున రైల్వే ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రతి నిత్యం 10 నిమిషాలకు ఒక్క బస్సు నడుపుతున్నామన్నారు. రూట్ నెంబర్ 250సీ సికింద్రాబాద్ బ్లూసీ పాయింట్ నుండి ఉదయం 4.30 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు వయా హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్ పీసీఎల్ మీదుగా ప్లాట్ ఫాం నెంబర్ 1 చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అక్కడి నుండి సికింద్రాబాద్ కు బస్సు సౌకర్యం ఉందని చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి చెంగిచెర్ల, ఉప్పల్, రామంతాపూర్ మీదుగా బోరబండకు ప్రతి రోజు 40 నిమిషాలకు ఒక్క బస్సు కొత్తగా ప్రారంభించినట్లు చెప్పారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా అదనంగా నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల రవాణా సౌకర్యార్ధం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో ఉప్పల్ నుండి ప్లాట్ ఫాం నెంబర్ 9 చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అధనంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.