calender_icon.png 23 January, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంటల్లో చిక్కుకున్న బస్సు.. ప్రయాణికులంతా సేఫ్

23-01-2025 04:36:37 PM

బిలాస్‌పూర్‌: హిమాచల్‌లోని సిమ్లా నుంచి కాంగ్రాకు వెళ్తున్న హెచ్‌ఆర్‌టీసీ(HRTC Bus) బస్సులో ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌లు తృటిలో తప్పించుకున్నారు. గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం(Chhattisgarh State)  బిలాస్‌పూర్‌లోని కండ్రౌర్‌ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌ నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపేశాడు. ప్రయాణీకులందరినీ బయటకు వెళ్లమని అప్రమత్తం చేశాడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని అధికారిక ప్రతినిధి తెలిపారు. బస్సు సిమ్లా నుండి కంగ్రాలోని నగ్రోటా బగ్వాన్‌కు వెళ్తుండగా, అందులో డ్రైవర్, కండక్టర్‌తో సహా ఎనిమిది మంది ఉన్నారు.

ప్రయాణికులందరినీ సకాలంలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని బస్సు కండక్టర్ సందీప్ సింగ్ తెలిపారు. డ్రైవర్‌, స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. బస్సులో నుంచి మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు సమీపంలోని చేతి పంపు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి(Firefighters) సమాచారం అందించిన వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారని అధికార ప్రతినిధి తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని, అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  తెలిపారు.