25-03-2025 12:32:57 AM
- మరమ్మతుకు సాయం చేసిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు
రాజేంద్రనగర్, మార్చి 24 (విజయ క్రాంతి ): నడిరోడ్డుపై అకస్మాత్తుగా ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.
సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మైలార్దేవ్ పల్లి లోని దుర్గా నగర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ కావడంతో నడిరోడ్డుపై ఆగిపోయింది. దీంతో ఒకసారిగా ట్రాఫిక్ స్తంభించి పోయిం ది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
అనంతరం బస్సును ఓ పక్కకు తోశారు. ఆ తర్వాత బస్సు మరమ్మతు చేయడంలో డ్రైవర్ కు సహకరించారు. బస్సు తిరిగి బాబు కావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ట్రాఫిక్ పోలీసులు చేసిన సాయానికి బస్సు డ్రైవర్ కండక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.