ఖమ్మం, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. 50 మంది విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. సైకిల్‌ను తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్కూలు బస్సు రోడ్డు పక్కకు ఒరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బస్సులోని కొంత మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.