calender_icon.png 3 April, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ నోటీసు ప్రకారం కొత్త బావి పూడ్చివేత

03-04-2025 12:25:12 AM

మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. వేణుగోపాల్

గద్వాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నా స్వాధీనం లో ఉన్న కొత్త బావి నీ పూడ్చలని సెక్షన్ 231 ప్రొవిజనల్ ఆర్డర్ యాక్ట్ 1965 ప్రకారంగా మున్సిపాలిటీ నుండి నోటీసు ఇవ్వడం జరిగిందని దాని ప్రకారంగానే పూడ్చడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. వేణుగోపాల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టణములో గద్వాల్ మున్సిపల్ పురపాలిక సంఘం చింతల పేట యందు గల కొత్త బావి నిరుపయోగంగా ప్రహారి గోడ లేకుండగా ప్రమాదకర స్థితిలో వున్నందున ప్రజలకు ప్రమాదాలు జరిగే పరిస్థితులు వున్న నేపథ్యంలో. ప్రస్తుతం కొత్త బావి జి. వేణుగోపాల్ ఆధీనంలో వున్నదని (7) రోజులలో కొత్త బావిని పూడ్చట/ప్రహారి గోడ. నిర్మాణము చేయగలరు అన్ని సెక్షన్ 231 ప్రొవిజనల్ ఆర్డర్ యాక్ట్ 1965 ప్రకారం నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు.

నోటీసుల ప్రకారంగానే ద్రుష్టి లో ఉంచుకొని కొత్త బావిని పూడ్చడం జరిగిందని కానీ కొంత కాలంగా ఆ బావిని నేను కబ్జా చేస్తున్నట్లు అసత్యపు వార్తలను సృష్టిస్తున్నారన్నారు. వాస్తవానికి ఈ కొత్త బావి సర్వే నెంబర్ 850 లో మా కుటుంబ స్వాధీనం లో ఉన్న ఈ స్థలం ఆస్తుల పంపకంలో  నా భాగనికి వచ్చిందని . అయినప్పటికీ ప్రజల అవసరార్థం అ భావినీ వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు.