calender_icon.png 16 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూరుగడ్డ నల్ల చెరువుకు మళ్లీ గండీ

23-09-2024 12:02:18 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 22(విజయక్రాం తి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ నల్ల చెరువు కట్టకు మళ్లీ గండి పడింది. రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇదే చెరువు కట్ట తెగిపోవడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  పరిశీలించి, వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి తాత్కాలిక పనులు పూర్తికాకముందే కట్ట తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతు పనుల్లో నాణ్యత లోపించడంతోనే గండి పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.