19-04-2025 01:15:31 AM
కడ్తాల్, ఏప్రిల్ 18 : కడ్తాల్ మండల కేంద్రంలో ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. హెరాల్ కేసు నేపథ్యంలో ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ల పై బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారిపై చార్జి షీట్లు దాఖలు చేయడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్ కేసు విషయంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వివరిస్తుందని వారు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణా త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ కుటుంబాలది అన్నారు.
హెరాల్ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేదా ఆస్తుల బదిలీ జరగలేదని స్పష్టమైన రికార్డులు ఆధార్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్రమంత్రి అమిత్ లు ఈడీని ఉపయోగించి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కేసులు నమోదు చేయిస్తూ కుట్రపూరితంగా వివరిస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా బిజెపి కుట్రలను ఎదుర్కొంటుందని వారు హెచ్చరించారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ బాబా, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు బానుకిరణ్, ఎస్సీ సెల్ నాయకులు శ్రీకాంత్, పర్వతాలు, విజయ్ రాథోడ్, లింగం, గురిగల్ల రామకృష్ణ, మోగిల్ల మహేష్, మణికిరణ్, ప్రవీణ్ గౌడ్, సోమరాజు సందీప్, ఆకాష్ గౌడ్, నీలం శ్రీకాంత్, నరేష్, లక్ష్మణ్, శ్రీను, శివ మరియు తదితరులు పాల్గొన్నారు