calender_icon.png 27 April, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం

26-04-2025 05:20:13 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాల్వంచలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ... పచ్చటి కాశ్మీర్ అందాలను చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని కఠినంగా అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను ఎదిరించి పర్యాటకుల్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడికి జోహార్లు అర్పించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, మరో ముస్లిం యువకుడు తన భుజాలపై ఎత్తుకొని పరిగెడుతూ ఒక మైనర్ బాలుడిని కాపాడిన తీరు అభినందనీయం అన్నారు. 

కాశ్మీర్లో పోలీసులు, సైన్యం కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది అలాంటప్పుడు తుపాకులు పట్టుకొని సరిహద్దులు దాటి ఎలా భారత్లో అడుగుపెట్టగలిగారు అరగంటసేపు 28 మందిని కాల్చి చంపి ఎలా వెళ్లగలిగారు ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ ఇంటలిజెన్సీ వైఫల్యం అని ధ్వజమెత్తారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవి పార్టీ పట్టణ కార్యదర్శి పి తులసీరామ్ కార్యవర్గ సభ్యులు వి సత్యవాణి ఎస్.కె నిరంజన్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి చిటికెన ముసలయ్య టౌన్ కమిటీ సభ్యులు వింజరాములు సీనియర్ నాయకులు కే కృష్ణమూర్తి బాస నారాయణ సోమలింగం గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.