17-03-2025 01:53:22 AM
మందమర్రి మార్చి 16 : దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల, బిఆర్‌ఎస్ పార్టీ అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను యూత్ కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో ఆదివారం జిల్లా కమిటీ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఎండి నయీమ్ మాట్లాడారు. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో సంబోధించి సభా మర్యాదను మంట గలిపారనీ విమర్శించారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని, లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోగా, నెరేళ్లకు వెళితే అరెస్ట్ చేశారనీ ఆయన మండి పడ్డారు.
తెలంగాణలో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడమే కాకుండా అనేక రకాలుగా దళితులను మోసం చేశారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి శాసనసభలో అనుచిత ప్రవర్తనపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శనిగరపు సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేవెల్లి శ్రీకాంత్, నోముల రాజేందర్, నాయకులు నవీన్, వడ్లూరి సునీల్ కుమార్, సుధాకర్, సాగర్, అబిలాష్, రాకేష్, రతన్, కైలాష్, బాబులు, అభి, సతీష్, శేఖర్, రమేష్, సాయి, ప్రశాంత్, చింటూ, సతీష్, సంతోష్, లు పాల్గొన్నారు.